‘ఝుమ్మంది నాదం’ హీరోయిన్ ని చిలిపి దోమ కుట్టిందట...!?
'ఝుమ్మంది నాదం" హీరోయిన్ తాప్సీ ఎప్పుడు చూసినా బ్లాక్ గూగుల్స్ పెట్టుకునే ఉంటుంది. తొలి సినిమాకే చాలా అవకాశాలు దక్కించుకున్న ఈ భామ బయటకంటే తెరపైనే అందంగా కన్పించింది. ఆ సినిమా ప్రారంభం నుంచి ఎక్కువగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న ఇంట్లోనే ఉండేది.
ఎక్కడికి వచ్చినా విచిత్రమైన గూగుల్స్ పెట్టుకుని కన్పించేది. దాంతో ఆమె ముక్కు కోతిముక్కులా ఉంటుందని సన్నిహితులు ఆటపట్టిస్తుంటారు. అయితే ఝుమ్మందినాదం చిత్రం షూటింగ్ లో కంటికి గాయం కావడంతో కొంతకాలం ఇలా గూగుల్స్ వాడాల్సి వచ్చిందని ఓ సందర్భంలో ఆమె చెప్పింది.
అయితే...బాగా పరీక్షగా చూస్తే ఆమె ముక్కుపై చిన్నపాటి గాయం కనబడింది. అదేమిటని అడిగితే చిలిపి దోమ కుట్టిందని తుంటరి సమాధానమిచ్చింది. దోమల్లో క్యూలెక్స్, అనాఫిలస్ వంటి దోమలుంటాయని మనకు తెలుసు..మరి చిలిపి దోమ అంటే ఎలా ఉంటుందో..? ఈసారి దానిని చూపించమని అడుగుదాం..


Click it and Unblock the Notifications











