మొగుడు ప్లాప్ గురించా తాప్సీ ఆ కామెంట్
ఇది తప్పు అని ఏదీ చేయను..అంతా మంచే జరుగుతుందనుకుంటాం.ఫలితం వచ్చిన తర్వాత కానీ చేసింది తప్పో ఒప్పో అర్దం కావు.మొగడు లో అన్నీ నచ్చే ఒప్పుకున్నాను.కథ,నా పాత్ర దర్శకుడు..ఇవన్నీ నచ్చిన తర్వాతే అంగీకరించాను.కాకపోతే నాకు ఆత్మ విశ్వాసం ఎక్కువ.తొందరపాటు నిర్ణయం తీసుకుంటూంటాను.అదే కొంప ముంచుతోంది.ఇప్పుడిప్పుడే సినిమా వాతావరణానికి పూర్తిగా అలవాటు పడుతున్నాను.
ఇకముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను అంటోంది తాప్సీ.ఆమె ఎంతో ఆశగా పెట్టుకున్న మొగుడు చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఆమె అన్న ఈ కామెంట్స్ అన్యాపదేశంగా ఆ సినిమాని ఉద్దేశించినవే అని విన్నవారు అంటున్నారు.ఇక ఝుమ్మంది నాదం చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తాప్సీకి ఇప్పటకి కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్టు పడలేదు.ఝుమ్మందినాదం చిత్రం ఫెయిలయినా ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెట్టడానికి,ఇండస్ట్రీలో గుర్తింపు తేవటానికి ఉపకరించింది.అలాగే ఆ తర్వాత విడుదలైన రవితేజ వీర చిత్రం ఆమెకు కలిసిరాలేదు.ఇప్పుడు మొగుడు సైతం ఆమెను నిరాశపరిచింది.


Click it and Unblock the Notifications











