ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ దర్శకత్వంలో రిలీజై క్రిటిక్స్ ప్రశంసలు పొందిన 'తార జమీన్ పర్' చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందనుంది. గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డును అందుకోవటానికి చెన్నై ఫిలిం ఛాంబర్ కి వచ్చిన అమీర్ ఖాన్ స్వయంగా ఈ విషయాన్ని వెళ్ళడించారు. సెప్టెంబర్ 14న ఈ సినిమా తమిళ,తెలుగుల్లోకి డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా చేయటానికి ఇంత కాన్పిడెన్స్ ఎలా వచ్చిందన్నదానికి సమాధానంగా ...మొదట సారి ఈ కథ వినగానే ప్రేమలో పడ్డాను. తర్వాత నా అభిమాన ప్రేక్షకులకు దీన్ని చూపాలనిపించింది అదే నన్ను ప్రేరేపించింది అంటున్నాడు.అలాగే ఈ సినిమాని నా పిల్లలు కూడా చూసి ఆనందించటం నన్ను సంతృప్తికి గురి చేసిందని చెప్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగులో నీలి మేఘ తారలు పేరుతోనూ,తమిళంలోకి Natchathiram పేరుతోనూ రిలీజ్ అవుతుందని చెప్తున్నాడు.