ఆస్కార్ అవార్డ్ కాకపోయినా కనీసం నామినేషన్ వస్తుందని ఎంతో మంది భారతీయులు ఆశలు పెట్టుకున్న "తారే జమీన్ పర్" కి ఆ అవకాశం లేదని తేలిపోయింది. ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో అవార్డుఆస్కార్ నామినేషన్ల జాబితా విడుదలవడానికి ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ నిన్న "అకాడమీ ఆఫ్ అమెరికన్ మోషన్ పిక్చర్స్" మొత్తం తొమ్మిది సినిమాలున్న ఒక జాబితాను విడుదల చేశారు.ఈ 81 వ సంవత్సరపు ఆస్కార్ నామినేటెడ్ విదేశీ విభాగపు చిత్రాల వరస ఇలా ఉంది.వాల్ట్ విత్ బాషిర్ (ఇజ్రాయిల్),త్రి మంకీస్(టర్కీ),రీవెంచీ(ఆస్ట్రియా),ది నెస్ససిటీస్ ఆఫ్ లైఫ్(కెనడా),ద బద్దర్ మీన్ కాంఫ్ కాంప్లెక్స్(జర్మిని),డిపార్చర్స్(జపాన్),టియర్ దిస్ హార్ట్ అవుట్(మెక్సికో),ఎవర్ లాస్టింగ్ మూవ్ మెంట్స్(స్వీడన్),ది క్లాస్(ప్రాన్స్) ఈ వరసలో ఉన్నాయి. ఇక గతంలోనూ అమీర్ ఖాన్ లగన్ అప్పుడు ఆస్కార్ కి వెళ్ళారు కానీ అప్పడూ మిస్సయ్యారు.