బ్రహ్మానందానికి బదులుగా ‘పైసా’లో కొత్త కమెడియన్
హైదరాబాద్ : క్రియేటివ్ దర్శకుడిగా ఎందరో కొత్త వారిని తెలుగు తెరకు పరిచయం చేసిన కృష్ణ వంశీ తన తాజా చిత్రం 'పైసా' చిత్రంలో కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. వీరిలో అక్బర్ బిన్ టాబర్, రాజు శ్రీవాస్తవ, లోబో, ఇతర నటీనటులు ఉన్నారు.
వీరిలో టాబర్ అనే హాస్యనటుడు ఒక నిమిషం పాటు గ్యాప్ లేకుండా చెప్పే డైలాగ్ ప్రేక్షకులను అలరిస్తుందని, బ్రహ్మానందం లాంటి టాప్ కమెడియన్లకు ప్రత్యామ్నాయంగా టాబర్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నారట కృష్ణవంశీ. మరి టాబర్ ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
టాబర్ గతంలో పలు హైదరాబాదీ సినిమాల్లో నటించారు. డెక్కనీ స్లాంగ్‌లో ఆయన చెప్పే డైలాగులు బాగా పాపులర్. చార్మినార్ ప్రాంతంలో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. తెలుగు సినిమాల్లో తొలిసారిగా నటిస్తున్న టాబర్ ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేయగలడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
టాబర్ గురించి కృష్ణ వంశీ మాట్లాడుతూ...'పైసా' సినిమాకు టాబర్ బ్రహ్మానందం లాంటి వాడు, ఆయన లేని లోటును టాబర్ బర్తీ చేస్తాడు అని తెలిపారు. 2010లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన టాబర్ ఇప్పటి వరకు 10 సినిమాల్లో నటించారు. అందులో జా భాయ్ జా, జబర్దస్త్, బిరోజ్‌గార్, గుల్లు దాదా రిటర్న్ వంటి చిత్రాల్లో ఆయనకు మంచి గర్తింపు వచ్చింది.


Click it and Unblock the Notifications











