Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆస్కార్ విజేత దర్శకత్వంలో హీరోయిన్ టాబు
క్రౌచింగ్ టైగర్ ..హిడెన్ డ్రాగన్, బ్రోక్ బాక్ మౌంటైన్ వంటి చిత్రాలతో ఆస్కార్ అవార్డు అందుకున్న అంగ్ లీ తాజా చిత్రంలో ప్రధాన పాత్రకు గానూ టబు ని ఎన్నుకున్నారు. యాన్ మార్టెల్ రచించగా ప్రజాదరణ పొందిన పుస్తకం 'లైఫ్ ఆఫ్ పి' ఆధారంగా ఈ చిత్రాన్ని లీ తీయబోతున్నాడు. ఈ చిత్రంలో 'పి' పాత్రను నూతన నటుడు సూరజ్‌సింగ్ చేయనున్న ఇందులో అతని తల్లి పాత్ర కోసం టాబుని ఎంపిక చేశాడు లీ. ఆమె భర్త పాత్రను ఎవరు చేస్తారనేది మాత్రం ఇంకా ఎవరనేది తెలియలేదు. ఈ పాత్రకోసం సుశాంత్‌సింగ్, సోనూసూద్ మధ్య పోటీ నెలకొంది. టబు సినిమాల్ని చూసిన ఆంగ్ లీ వాటిలో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయ్యి, ఆమెని తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ పాండిచ్చేరిలో జనవరి 2011 లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు ఆంగ్ లీ ..గత కొద్ది రోజులుగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ లో ఉంటున్నారు. కొందరు నటులని ఆయన ఎంపిక చేసుకుని ఆడిషన్ నిర్వహిస్తున్నారు. ఇక టబు చాలా సెలిక్టివ్ గా సినిమాలు చేస్తోంది. టబు ఈ మధ్యన తో బాత్ పక్కి, 2007లో చీనీకమ్ చేసింది.