రజనీకాంత్ తాజా చిత్రంలో నటించడానికి ఇలియానా నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకు టబు ఎంపికైనట్టు తాజా సమాచారం. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో జగపతి బాబు సరసన టబు నటించబోతోంది. తమిళంలో మాత్రం రజనీ సరసన నయనతార నటించబోతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర చాలా చిన్నది. ఆయన ఈ సినిమా తీయడానికి కారణం తన గురువు కె బాలచందర్ ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకే నని తెలుస్తోంది.