అల్లు అర్జున్ పాటలో టబు ఐటం గర్ల్

By Srikanya

ఆర్యలో సూపర్ హిట్టైన అ అంటే అమలా పురం సాంగ్ లో అబినయశ్రీ చిందులు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడా పాటకి హిందీలో టబు డాన్స్ చేయనుంది. అల్లు అర్జున్,అభినయశ్రీ కాంబినేషన్ లో వచ్చే ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇక సోనూ సూద్ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న లక్కీ అన్ లక్కీ చిత్రంలో ఈ పాటను రీమిక్స్ చేసి అందిస్తున్నారు. ఇందునిమిత్తం దేవిశ్రీ ప్రసాద్ నుంచి సోనూ సూద్ రైట్స్ తీసుకున్నారు. ఈ పాట బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి అబ్జల్ రిజ్వీ డైరక్ట్ చేస్తున్నారు. రోడ్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సోనూసూద్,మల్లికా షెరావత్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. వాళ్లు రకరకాల ప్రాంతాలు ప్రయాణిస్తూంటారు. ఏ ప్రాంతంలో వాళ్లు వెళితే అక్కడ పాట వస్తుంది. అందులో భాగంగా పంజాబీ,హర్యానీ,తెలుగు,తమిళ్,మరాఠి పాటలు వస్తాయి. తెలుగుకి ఈ పాటను ఎంపిక చేసారు. మ్యూజికల్ హిట్ గా ఈ చిత్రాన్ని నిలపాలని గట్టి పట్టుదలతో సోనూసూద్ ఉన్నారు. ఇక ఈ పాటతో టబు కూడా ఐటం గర్ల్ గా ప్రమోషన్ పొందుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఐటం సాంగ్ ల హవా నడుస్తూండటంతో ఆమె మారు మాట్లాడకుండా ఓకే చేసేసిందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X