టబుకు నచ్చిన చంద్ర సిద్ధార్థ!?!
ఆ నలుగురు, మధు మాసం లాంటి సినిమాలు తీసిన దర్సకుడు చంద్రసిద్ధార్థ తాజాగా టబు ప్రధాన పాత్రతో రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ టబు టాలెంటెడ్ ఆర్టిస్టే కాదు కవితలు, కథలు రాసే హాబీ ఉన్నామె. అంతేకాదు ఉన్నదున్నట్టు మాట్లాడటం కూడా ఆమె ప్రత్యేకత. చంద్ర సిద్దార్థ విషయంలోనూ ఉన్నది ఉన్నట్టు చెప్పింది. సినిమా కథ నచ్చడం మూలంగానే ఈ సినిమాకు ఒప్పకున్నానని టబు చెబుతోంది. చంద్ర సిద్ధార్థ గురించి ఇంకా చెబుతూ...ఈ మధ్యే నాపై పాటను చిత్రీకరించారు..చంద్ర సిద్ధార్థ ఎపుడూ రొటీన్ షాట్లకు వెళ్లకుండా కొత్త యాంగిల్స్ లో ప్రతి షాట్ ను తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు..అంతే కాదు సస్పెన్స్ కూడా ఈ సినిమాలో ప్రాధాన్యతను సంతరించుకుంది...అందుకే ఆలోచించకుండా ఈ సినిమాకు సంతకం చేశాను.. ప్రేక్షకులు ఈ సినిమాలో కచ్చితంగా కొత్తదనాన్ని పొందవచ్చు..అంటూ చంద్ర సిద్ధార్థను పొగడ్తలతో ముంచెత్తుతోంది.


Click it and Unblock the Notifications











