నాగార్జునను గుర్తు పట్టని స్టార్ హీరోయిన్!
సినీ నటుడు నాగార్జున అంటే తెలియని వ్యక్తి తెలుగునాట ఎవరైనా ఉంటారా... అలాంటి వ్యక్తికి ఎవరు మీరు...? అనే ప్రశ్న ఎదురైంది. అది కూడా ఆయనకు అత్యంత సన్నిహితురాలైన హీరోయిన్ టబు నుంచి. వినడానికి నమ్మక్యంగా లేక పోయినా ఇది నిజం.
అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అందుకు కారణం నాగార్జున తన తాజా సినిమా 'షిరిడి సాయి' చిత్రం కోసం తెల్లగడ్డం పెంచి కనబడటమే.
తనను టబు గుర్తు పట్టక పోవడంతో హలో...ఐయామ్ నాగార్జున అంటూ పరిచయం చేసుకున్నాడు ఈ టాలీవుడ్ మన్మధుడు. ఇదంతా ఇద్దరి మధ్య కావాలని జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ కావడంతో అక్కడున్న వారి నోట నవ్వులు విరబూసాయి.
నాగార్జున, టబు గతంలో చాలా చిత్రాల్లో నటించారు. ఈ ఇద్దరు జంటగా నటించిన 'నిన్నే పెళ్లాడితా' మూవీ భారీ విజయం సాధించింది. హైట్, వెయిట్ పరంగా ఇద్దరూ తగిన జోడీ కావడంతో....తెరపై ఈ జంట మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ బాగా వర్కౌట్ అయ్యేవి. ఇద్దరి హధ్య ఎఫైర్ ఉందని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. నాగార్జున టబు కోసం స్వయంగా హైదరాబాద్‌లో దగ్గరుండి ఇల్లు కొనిపెట్టాడని, టబు అమలకు అనఫీషియల్ సవితిలా మారిందనే రూమర్లు కూడా అప్పట్లో వినిపించాయి.


Click it and Unblock the Notifications











