టబు ని మార్చిన 'పాండురంగడు'?

అలాగే ఈ చిత్రం కోసం బాలీవుడ్ సెక్స్ సింబల్స్ గా చెప్పుకునే మల్లికా షెరావత్,బిపాసా,సుస్మితా సేన్ వంటి వారిని అడిగారుట. అయితే వారు రిజక్ట్ చేసిన సెక్సీ లాయర్ పాత్రలో టబు ఇప్పుడు కనపించబోతోంది. 'మై కజిన్ విన్నీ' అనే హీలీవుడ్ సినిమా రీమేక్ గా వస్తోంది. ఇంతకీ ఈ సినిమాకీ పాండురంగడు కీ లింకేమిటంటే 'పాండురంగడు' ముందు టబును అడిగితే రిజక్టు చేసిందిట.
తర్వాత మిగతా హీరోయిన్స్ కాదనేసరికి ఆ పాత్ర కి చేసే హీరోయిన్ దొరక్క దర్శక,నిర్మాతలు సినిమా మానేద్దామనుకున్నారుట. అయితే టబు పాండురంగడు చేసాక ఏం రియలైజ్ అయిందో ఏమో వాళ్ళకి కబురు పెట్టిందిట. నేను చేయటం లేదని చిత్రాన్ని మానుకోవటం నా కిష్టం లేదు...నేను చేస్తాను అని చెప్పిందిట. ఇంతలో ఇంతలా ఏం జరిగి మారిపోయిందని వారు ఆశ్చర్యపోయారట. తర్వాత తెలుగులో ఆమె పాండురంగడులో వేశ్యగా రెచ్చగొట్టే రేంజిలో చేసింది...దాంతో సెక్సీగా కనిపించటంలో తప్పేమీ లేదని డిసైడ్ అయ్యుంటుంది అని వారు అర్ధం చేసుకునారుట. దాంతో వారు పాండురంగ మహత్యం అని సరిపెట్టుకున్నారుట.


Click it and Unblock the Notifications











