నాగే కాదు,టబుకి అతనన్నా..

By Staff

Tabu
నాగార్జునకూ టబుకీ మధ్య రిలేషన్ ఉందని చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టబు తనకి నాగార్జునే కాకుండా మరొకరు అంటే చచ్చేంత ఇష్టమని బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చి అందరని షాక్ కి గురిచేసింది. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..రాహుల్ గాంధీ అని చెప్తోంది. దాంతో టబు కన్ను అతనిపై పడిందేమిటా అని అందరూ ఆలోచనల్లో పడతున్నారు. ఇక ఈ లేడి బ్యాచులర్ ఈ మధ్య లాక్మే ఫ్యాషన్ షో కి అటెండై నాగార్జుతో కలిసి భుజాలపై చేతులు వేసుకుని వచ్చి ఫోజ్ లిచ్చించి. ఇవన్నీ చాలవన్నట్లు టబు ఈ మధ్య ఓ పాపులర్ ఇంగ్లీష్ సినీ పత్రిక ఫిల్మ్ ఫేర్ లో ఓ ఇంటర్వూలో నాగార్జున గురించి మాట్లాడింది.

నాగార్జున తో నా రిలేషన్ గురించి గత ఇరవై సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు...వారికి ఏం చెప్పను..అయినా నాగార్జున నన్ను ఇంతకాలం భరిస్తున్నాడు...అతనో స్పెషల్ పర్శన్..అంది. మరో ప్రశ్నకు సమాధానంగా 'రాహుల్‌ గాంధీ, నాగార్జునలంటే నాకు చచ్చేంత ఇష్టం" అని చెప్పడం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. రాహుల్‌ గాంధీపై తనకున్న ఇష్టాన్ని బాహాటంగా ప్రకటించుకున్న టబు ని కాంగ్రేస్ వారు వినియోగించుకుంటారేమో చూడాలంటున్నారు.

గతంలో కూడా కాఫీ విత్ కరణ్ అనే టీవీ పోగ్రామ్ లో కూడా టబు దర్శకుడు కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..తనకు నాగార్జునకి ఉన్న రిలేషన్ షిప్ ని వివరించింది. నేను తరుచుగా హైదరాబాద్ వెళ్తూంటాను..అందరూ నాగ్ కోసమే వెళ్తున్నానని మాట్లాడుకుంటున్నారు..అయితే నాకు అక్కడో సొంత ఇల్లు ఉంది..స్నేహితులు ఉన్నారు..అయినా నేను ఇప్పటికీ హైదరాబాద్ వాసిగానే భావిస్తాను..నాకు భాయ్ ప్రెండ్స్ లేరని అనను..అయితే భాయ్ ప్రెండ్స్ వచ్చారు..వెళ్ళారు..అయినా నాగార్జున మాత్రం మిగిలిపోయాడు..అతని గురించి నేనేం చెప్పను..అతను నా జీవితానికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి..అతనితో నా రిలేషన్ అమూల్యమైనది...దానికి ప్రత్యేకమైన లేబుల్ పెట్టలేదు..దాని గురించి ఎక్కువ మాట్లాడలేను..ఏమీ చేయలేను అని స్పష్టం చేసింది.ఇప్పుడేమో ఇలా చెప్పుకొచ్చింది.అదీ సంగతి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X