'మంత్ర,' తో ఛార్మి ,'అనసూయ'తో భూమిక క్లిక్ అయినట్లే టబు ఇప్పుడు 'నా ఇంట్లో ఒకరోజు' అనే థ్రిల్లర్ చిత్రంతో పాపులర్ అవుతుందిట.కాకపోతే ఆ ఇద్దరివి స్ట్రయిట్ చిత్రాలు. టబు ది మాత్రం డబ్బింగ్ సినిమా.'హవా' అనే పేరుతో హిందీలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారు.ఇదీ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం. దీనిలో హర్రర్.. థ్రిల్లర్ కలగలిసిన అంశాలు ఉంటాయి.గుడ్డు ధనోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా విచిత్రంగా ఉంటుంది.భర్త నుండి విడాకులు తీసుకున్న టబు పాత్ర తన పిల్లలను తీసుకుని సొంత ఇల్లు ఐన ఓ పాత బంగ్లా కి వెళుతుంది.అక్కడ ఆమె కు విచిత్రమైన సంఘటనలు ఎదురౌతూంటాయి.ఓ దెయ్యం గాలి రూపంలో వచ్చి రేప్ చెయ్యబోతుంది.అలా హాట్ హాట్ సీన్లతో ,ఉత్కంఠతో నడిచే ఈ సినిమా అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు.మనకి ఇక్కడ ఈ సీజన్ నడుస్తోంది కాబట్టి ఆశతోనిర్మాతలు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు.కాబట్టి మంత్ర,'అనసూయ' సినిమాలు ప్రేక్షకులను ఆలరించిన తరహాలో "నా ఇంట్లో ఒకరోజు" చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందువచ్చు.