త్వరలో థియేటర్లలోకి రానున్న 'పాండు రంగడు' సినిమాలో వేశ్యగా టబు కనపడి కనువిందు చేయబోతోంది. అసలు టబు పేరు వినగానే 'నిన్నే పెళ్ళాడతా'లో పండు పాత్ర టక్కున గుర్తుకు వస్తుంది. తర్వాత తెలుగులో పెద్దగా వెలగలేకపోవటంతో సైలంట్ గా హిందీలో సెటిలైంది. అప్పుడప్పుడు నాగార్జు తో ఎఫైర్ అంటూ మీడియా గుర్తుచేస్తూండటమే ఆమెకు సంభందిచిన వార్తగా మిగిలింది. దాంతో వేరే దారి లేక ఆ రకంగా ఆమెను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆనంద పడుతూండటం అలవాటుగా మారింది. దీన్ని బ్రేక్ చేస్తూ మొన్న ఇదీ సంగతి అంటూ తన ప్రౌఢ అందాలు ఆరబోసినా వర్కవుట్ కాలేదు. అయ్యో అనుకునేలోగా బాలకృష్ణ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రెడీ అవుతున్న పాండు రంగడు సినిమాలో కథను మలుపు తిప్పే వేశ్యపాత్రకి ఎంపికయ్యింది.(చాందినీ బార్ లో టబు పాత్ర చూసి ఎంపిక చేసుంటారని కొందరంటున్నారు). కామన్ గా రాఘవేంద్రరావు సినిమాల్లో ఫ్యామిలీ పాత్రలకే హీరోయిన్లు శృంగార దేవతల్లా కనపడుతూంటారు. మరి వేశ్యపాత్ర అంటే ఏ రేంజిలో ఉంటుంది. అందులోనూ టబు అంటే..