తమన్నా కంటే టబునే బెస్ట్ అని ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చిన నాగార్జున
తన కుమారుడు నాగచైతన్య హీరోగా చేసిన 100% లవ్ చిత్రం ప్రమేషన్ లో భాగంగా నాగచైతన్, నాగార్జున ఇద్దరూ ఓ టీవి ఇంటర్వూకి హాజరయ్యారు. ఆ సందర్భంగా టీవి యాంకర్..నాగార్జునని మీకు నిన్నే పెళ్ళాడతా చిత్రంలో మహాలక్ష్మి (టబు)నచ్చిందా లేక 100% లవ్ లో కనిపించే మహాలక్ష్మి (తమన్నా) నచ్చిందా..ఇద్దరిలో ఎవరు బాగా చేసారనిపించారు అని ప్రశ్నించింది. దానికి నాగార్జున తడుముకోకుండా ఇమ్మీడియట్ గా టబునే బాగా చేసింది. తమన్నా కంటే చాలా బాగా నటించింది అన్నారు. అది విన్న నాగచైతన్య ఆశ్చర్యపోయాడు. ఇక నాగార్జున ఈ చిత్రం ప్రమోషన్ కోసం అన్ని ఛానెల్స్ తిరిగుతున్నారు. తన కొడుక్కి వచ్చిన జెన్యూన్ హిట్ ని బాగా ప్రచారం చేసి నిలబెట్టాలనే ఆలోచన ఆయనలో కనపడుతోంది. ప్రస్తుతం నాగార్జున హీరోగా శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో ఢమురుకం చిత్రం రూపొందుతోంది. సోషియో ఫాంటసీ గా రూపొందే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











