కథ వినకుండా టబు ఓకే చేసేసింది
ఈ విషయమై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... 'హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నా. ధోనీ తర్వాత దర్శకత్వం వహించనున్న చిత్రమిది. తెలుగులో 'ఉలవచారు బిరియానీ' పేరిట రూపొందిస్తున్నా. నాకు జంటగా టబు నటిస్తోంది. ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు'అని చెప్పారు. కొన్ని నెలల క్రితమే 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్ర హక్కులు ప్రకాష్‌రాజ్ కొన్నారు. తానే దర్శకత్వం వహించనున్నట్లు ఆయన తేల్చారు.
ఇంతకుముందు ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆకాశమంత', 'ధోని' కమర్షియల్‌గా విజయం సాధించకున్నా.. ప్రశంసల వర్షంలో మాత్రం తడిశాయి. ప్రస్తుతం మళ్లీ దర్శకత్వం వహించనున్నారాయన. మలయాళంలో ఇటీవల విడుదలైన మంచి కలెక్షన్లు రాబట్టిన చిత్రం 'సాల్ట్ అండ్ పెప్పర్'. ప్రస్తుతం ఈ సినిమాను ప్రకాష్‌రాజ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో 'ఉన్ సమయల్ అరైయిల్' పేరు ఖరారు చేశారు.


Click it and Unblock the Notifications












