టబుని అతని భార్యే ఒప్పించింది

అయితే తాజాగా మధూర్ భార్య రేణు ఇంట్రాక్షన్ తో ఈ వివాదానికి తెరపడినట్లయింది. ఆమె, టబు ముంబయిలో ఓ షాపింగ్ మాల్ లో కలుసుకున్నారు. షాపింగ్ అనంతరం ఇద్దరూ ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నాక టబుని ఆమె తన ఇంటికి ఆహ్వానించింది. ఇద్దరూ ఆ రాత్రి కలిసి భోజనం చేసే దాకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాగే మధూర్ వచ్చేదాకా టబు వెయిట్ చేసింది. లేట్ నైట్ వచ్చిన అతన్ని సున్నితంగా మందలించిన టబు ఆ తర్వాత మనస్సు విప్పి రకరకాల టాపిక్స్ అతనితో చర్చించింది. దాంతో ఇద్దరూ మళ్ళీ చాందినీ బార్ షూటింగ్ రోజులు గుర్తు చేసుకున్నారు. అనంతరం మళ్ళీ కలిసి ఓ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అంతగా అవసరమైతే మధూర్ ప్రస్తుతం చేస్తున్న జైలు చిత్రంలో గెస్ట్ గా చేయటానికి సైతం పచ్చ జెండా ఊపింది. ఇక ఇదంతా తన భార్య ఘనతే నని మధూర్ మురిపెంగా చెప్తున్నారు.
tabu bollywood chandni bar national award madhur bhandarkar renu mumbai టబు బాలీవుడ్ నేషనల్ అవార్డు చాందినీ బార్ మధూర్ బండార్కర్ రేణు జైలు


Click it and Unblock the Notifications