వేషాలు లేక విలన్ గా మారిన ‘టబు’
ప్రేమలో పడి వివాదాలు ఎదుర్కొంటున్న తారలు ఎంతో మంది వున్నారు. కానీ టబు మాత్రం నాగార్జునతో చక్కగా వ్యవహారం నడిపినప్పటికి నిబ్బరంగా నిలబడగలిగింది. అందుకే అంటారు ఏది చెయ్యాలన్నా కాస్తంత ధైర్యం కావాలనీ, అది టబు దగ్గర చాలా ఉందట. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ప్రతినాయిక పాత్రలు చేయడానికి కూడా సిద్దపడుతుంది. గతంలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 'మఖ్బూల్" చిత్రం లో ప్రతినాయిక పాత్రలాంటి పాత్రను చేసిన టబు ఇప్పుడు పూర్తి ప్రతినాయిక పాత్రను చే0యాలనుకుంటుంది.
అభినయ్ డియోల్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో ప్రతినాయిక పాత్రను చయమని టబుకు అవకాశాలు వస్తున్నాయట. అయితే టబు ఆ క్యారెక్టర్ ను కాస్తంత మార్చమని దర్శకనిర్మాతలను కోరుకుందట. ఆ పాత్ర అలా ఉంటేనే బాగుంటుంది దాన్ని మారిస్తే పూర్తి అర్థం పోతుంది. అని అభినయ్ పాత్రను మార్చను అని చెప్పాడట. దీనితో ముందు నెగిటివ్ రోల్ చేయను అని చెప్పిన టబు చేతిలో సినిమాలు లేక రెడీ అని సిగ్నల్ ఇచ్చిందట ఆ పాత్ర కూడా అందాలతో నిండి ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











