తల్లి అయ్యేందుకు నిరాకరించిన హీరోయిన్
హైదరాబాద్: ఒకప్పుడు తన హాట్ అండ్ సెక్సీ గ్లామర్‌తో సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్ టబు. 42 సంవత్సరాల టబు ప్రస్తుతం హీరోయిన్ పాత్రలు చేసే అవకాశం లేక పోవడంతో ఇతర పాత్రలు చేస్తూ నటిగా తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంది. నాలుగు పదుల వయసు దాటిన టబు పర్సనాలిటీ తల్లిపాత్రలకు బాగా సూటవుతుందనే ఉద్దేశ్యంలో పలువురు దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటి పాత్రలు చేసేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెబుతోంది ఈ ప్రౌడ సుందరి.
బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ త్వరలో తెరకెక్కించబోయే సినిమాలో....హీరోయిన్ ప్రియాంక చోప్రాకు తల్లిగా నటించాలనే ప్రతిపాదన టబు ముందుకు తెచ్చింది. అయితే తాను అప్పుడే ముసలి పాత్రల్లో నటించడానికి సిద్దంగా లేనని ఆ ఆఫర్‍ను తిరస్కరించింది టబు.

జోయా అక్తర్ తర్వాతి సినిమా వివరాల్లోకి వెళితే....'దిల్ ధడక్నే' చిత్రాన్ని ఆమె తెరకెక్కించబోతున్నారు. ఇదొక పంజాబీ ఫ్యామిలీ స్టోరీ. ఈ చిత్రంలో అనిల్ కపూర్, ఫర్హాన్ అక్తర్, అనుష్క శర్మ, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
టబు గురించి వివరాల్లోకి వెళితే....ఆమె గతంలో నటించిన చీనికం, చాందినీ బార్ చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇప్పటి వరకు టబు వివిధ భాషల్లో దాదాపు 60 చిత్రాల్లో నటించింది. లైఫ్ ఆఫ్ పై అన హాలీవుడ్ చిత్రంలో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











