పట్టుచీర కట్టి టబు పూలెట్టుకెళితే..
టబు, అబ్బాస్ లు నటిస్తున్న సినిమా చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. కె.ఎన్.వై పతంజలి రాసిన నువ్వేకాదు నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబును వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులు మెచ్చేరీతులో కనిపించనున్నట్టు దర్శకుడు చెబుతున్నారు. 50 శాతం టాకీ పార్టీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక పాట చిత్రీకరణను కూడా పూర్తి చేసుకుంది. పట్టు చీర కట్టి పూలెట్టుకెళితే అనే పాటను టబు తదితరులపై శ్రీధర్ రెడ్డి నృత్యదర్శకత్వంలో చిత్రీకరించారు. నవంబర్ నెలాఖరులో షూటింగ్ ను పూర్తి చేసుకోనున్న ఈ సినిమాలో ఇంకా బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, సునీల్, చలపతి రావు తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











