నాగార్జున, టబు మధ్య రిలేషన్ చాలా కాలంగా వింటున్నదే. అయితే తాజాగా వాళ్ళిద్దరూ లాక్మే ఫ్యాషన్ వీక్ లో హఠాత్తుగా ప్రత్యక్షమై కెమెరాల కళ్ళకు చిక్కారు. వీళ్ళు ఇలా బహిరంగంగా కనిపించడమే కాకుండా నాగార్జున ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఫోటోలు కూడా దిగడం అందరినీ అకట్టుకుంది. ఇక నాగార్జున సుమారు ఓ రెండు గంటల సేపు 'లాక్మే' కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించారు. నిన్నే పెళ్ళాడతా చిత్రం నుండి కొనసాగుతున్న ఈ బంధం మరో సారి అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఇన్నాళ్ళూ వీరి గురించి రూమర్స్ గా చెప్పుకున్న వాళ్ళు ఈ సర్దుబాటు చూసి ముక్కున వేలు వేసుకున్నారు.