చిన్నడు-పెద్దోడు కాదు....‘ తడాఖా’!
హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకుడు. తమన్నా, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిరవధికంగా చిత్రీకరణ జరుగుతోంది.
ఈ చిత్రానికి గతంలో 'భలేతమ్ముడు' అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత 'చిన్నోడు-పెద్దోడు' అనే టైటిల్ ప్రచారం లోకి వచ్చింది. తాజాగ అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'తడాఖా' అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు ఈ టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడనుంది.
టైటిల్ ఎంపిక విషయంలో నాగార్జున నిర్ణయం మేరకు దర్శక నిర్మాతలు నడుచుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య ఇటీవల నటించిన పలు సినిమాలు ప్లాపవ్వడంతో కొడుకు సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు నాగార్జున. తడాఖా టైటిల్ అయితే క్యాచీగా ఉంటుందని నాగార్జున సూచించినట్లు చర్చించుకుంటున్నారు.
చిన్నోడు-పెద్దోడు అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ పేరుపై మహేష్, వెంకీ పాపులర్ కావడంతో...... నాగచైతన్య, సునీల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆ నిర్ణయాన్ని మానుకున్నాురట. ఇక సినిమా కాన్సెప్టులోకి వెళితే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో నాగచైతన్య అల్లరి తమ్ముడిగా, సునీల్ పిరికి పోలీస్ గా కనిపించనున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).


Click it and Unblock the Notifications











