ప్రకాష్ రాజ్ మూవీకి లీగల్ ట్రుబుల్
ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో నానా పాటేకర్, శ్రీయ, అలీ ఫైజల్, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తూ రూపొందిన చిత్రం 'తడ్కా'. జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2011లో మలయాళంలో వచ్చిన హిట్ మూవీ 'సాల్ట్ ఎన్ పెప్పర్'కు రీమేక్. తాజాగా ఈ చిత్రం న్యాయ సంబంధమైన చిక్కుల్లో పడింది.
జీ స్టూడియోస్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్.... ఈ మూవీపై పిటీషన్ వేయడంతో బాంబే హైకోర్ట్ సోమవారం(ఫిబ్రవరి 4) ప్రకాష్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది. చిత్ర సమర్పకులుగా ఉన్న సమీర్ దీక్షిత్, జితీష్ వర్మతో... సినిమా కాపీరైట్స్ విషయంలో ఏర్పడిన ఆర్థిక లావాదేవీల వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

వీరి మధ్య జరుగుతున్న గొడవకు ప్రకాష్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఒక రీజన్ అనే సమాచారం. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కోర్టు ముందు హాజరైన తన అభిప్రాయం ఏమిటో చెప్పాలని ఆదేశించింది. కోర్టు పరిధిలో వివాదం ఉన్నందున... అనుమతి లేకుండా సినిమా రిలీజ్ చేయకూడదని సూచించింది.
'తడ్కా' చిత్రానికి ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించగా సమీర్ దీక్షిత్, జతీష్ వర్మ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. తుకారాం, మధుర అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథ నేపథ్యంలో ఈమూవీ సాగుతుంది. తుకారం పాత్రను నానా పాటేకర్, మధుర పాత్రను శ్రీయ పోషించారు.


Click it and Unblock the Notifications











