మధుర్ బండార్కర్ డైరక్షన్ తోనే చిరు సినిమా ఖరారు
చిరంజీవి కెరీర్ లో మంచి హిట్ గా నిలించిన ఠాగూర్ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్క బోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రాన్ని మధూర్ బండార్కర్ చేయబోతున్నట్లు సమచారం. తమిళంలో తొమ్మిదేళ్ల కిందట వచ్చిన 'రమణ' చిత్రం ఠాగూర్ కి మూలం. దాని రైట్స్ తీసుకుని తాజాగా హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మరో డైరక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించటం ఖరారైయినట్లు చెప్తున్నారు.
అయితే ఆయన మాత్రం అఫీషియల్ గాఈ సినిమాకు ఓకే చెప్తూ ప్రకటన చెయ్యలేదు. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ జంటగా నటిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. రెండు చోట్లా మంచి విజయం సాధించింది. తమిళంలో 'రమణ'మురుగదాస్ రూపొందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











