గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ పీకాక్ అవార్డు పొందిన చిత్రం
నలభైవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు గోవాలో గురువారంతో ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవంలో ప్రదర్శించిన చిత్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గోల్డెన్ పీకాక్' (స్వర్ణమయూరం) అవార్డును ఈసారి తైవాన్ చిత్రం 'ఐ కాంట్ లివ్ విదౌట్ యూ' గెలుచుకుంది. దక్షిణకొరియా-ఫ్రాన్స్‌లు నిర్మించిన 'ది బ్రాండ్‌న్యూ లైఫ్'కు రజితమయూరం (సిల్వర్‌పీకాక్) లభించింది. ఇక, జార్జియా-కజకిస్తాన్ చిత్రం 'ది అదర్ బ్యాంక్' చిత్రానికి జ్యూరీప్రత్యేక అవార్డు గెలుచుకుంది. స్వర్ణమయూరం విజేతకు నలభైలక్షల రూపాయల నగదుబహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికనిచ్చారు. రజితమయూరం గెలుచుకున్న చిత్రానికి సిల్వర్‌పీకాక్, పదిహేనులక్షలరూపాయల నగదు లభించింది. ఇక, జ్యూరీ ప్రత్యేక అవార్డు అందుకున్న చిత్రానికి కూడా పదిహేనులక్షల రూపాయల నగదు, రజిత మయూరాన్ని అందించారు.ఇక ది మ్యాన్ బియాండ్ ద బ్రిడ్జ్ చిత్రాన్ని ఈ ఫెస్టివల్ లో ప్రారంభ చిత్రంగా ప్రదర్సించారు.


Click it and Unblock the Notifications











