చెప్పే మాటలకు చేసే చే్ష్టలకు సంభధం లేకుండా హాట్ తాప్సీ
ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ మొన్న వీరలో సైతం గ్లామర్ పాత్రలనే ఎంచుకుంటూ మొందుకెళ్తోంది. ఆఫర్ వస్తే చాలని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటున్న ఆమె మాత్రం తను సినిమా కమిటవ్వాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటోంది. రీసెంట్ గా ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ..నాకు ఫలానా హీరోతోనే నటించాలి అనే రూల్సేమీ లేవు. కథను ముందుకు నడిపించే సత్తా ఉన్న హీరో అయితే చాలు. అలాగే నేను ఓ చిత్రం అంగీకరించేటప్పుడు తొలి ప్రాధాన్యం కథకే.
కథ బలంగా ఉంటే సినిమా విజయాన్ని సాధిస్తుంది. ఆఫర్స్ వస్తున్నాయని నా పాత్రకు ప్రాధాన్యం లేని సినిమా ఒప్పుకొంటే కెరీర్ దెబ్బ తింటుంది. అందుకే ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాను అని చెప్పింది. ఇజి విన్న వారంతా నోరు వెళ్ళబెడుతున్నారు. చెప్పేదానికి, చేస్తున్నదానికి పొంతన ఏమన్నా ఉందా అంటున్నారు. అలా కథలు ఎంపిక చేసుకుంటే ఝుమ్మంది నాదం, వీర, వస్తాడు నా రాజు చిత్రాలు ఎందుకు ప్లాప్ అవుతాయి అంటున్నారు. ప్రస్తుతం తాప్సీ గోపిచంద్ సరసన 'మొగుడు' చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











