Takkar Teaser Review: నాతో సెక్స్ అనుభవించి మరిచిపో.. ప్రేమ, పెళ్లి వద్దు.. హీరో సిద్దార్థ్‌కు హీరోయిన్ టక్కర్
ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాణ సారథ్యంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టక్కర్. ఈ చిత్రంలో సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్ కాంత్, ఆర్జే విగ్నేశ్వర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మే 26న రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో హీరో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టక్కర్ మూవీ టీజర్ ఎలా ఉందంటే?
యాక్షన్, పవర్ ప్యాక్ట్‌గా టక్కర్ టీజర్:టక్కర్ సినిమా టీజర్ విషయానికి వస్తే.. యాక్షన్, పవర్ ప్యాక్ట్‌గా ఉన్నట్టు స్పష్టమైంది. సిద్దార్థ్ మరోసారి యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి, పేద అబ్బాయికి మధ్య రిలేషన్‌షిప్ అనేది మరో పాయింట్‌గా కనిపించింది. సిద్దార్థ్, దివ్యాంశ మధ్య ఘాటైన రొమాన్స్, కెమిస్ట్రీ కనిపించింది. ప్రేమ, పెళ్లిపై ఎలాంటి మంచి అభిప్రాయం లేని అమ్మాయితో అబ్బాయి ట్రావెల్ చేయడం ఈ టీజర్‌లో ఆసక్తిగా కనిపించింది.

లవ్, రొమాంటిక్ అంశాలతో :టక్కర్ టీజర్‌లో.. నేనంటే ఇష్టం లేదా? లేక లవ్ అంటే ఇష్టం లేదా? అని సిద్దార్థ్ అడిగితే.. నాకు లవ్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే అది ఎక్కడా లేదు అనే డైలాగ్‌తో టీజర్‌ను మొదలుపెట్టారు. సిగరేట్ తాగుతూ దివ్యాంశ..నాకు ఈ బ్రాండ్ అంటే ఇష్టమని నీకు ఎలా తెలుసు అనడం క్రేజీగా ఉంది. మగాళ్లపై నీకు ద్వేషం ఎందుకు అని సిద్దార్థ్ ప్రశ్నిస్తే.. మేమంత మీకెందుకు లొంగాలి అంటూ దివ్యాంశ ప్రశ్నించడం చూస్తే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందనే అభిప్రాయం కలుగుతుంది.
దివ్యాంశ రియాక్షన్ వైల్డ్‌గా:డబ్బు లేకపోతే ఫర్వాలేదు. ఎక్కువైతేనే హ్యాపీగా ఉండలేం అని దివ్యాంశ అంటే.. ఆ మాటలు డబ్బు ఎక్కువైన వాళ్లు చెప్పే మాటలు అని సిద్దార్థ్ జవాబిస్తూ.. రా ఇంటికి వెళ్దాం అని అంటాడు. అయితే మనం ఇలానే కారులో హ్యాపీగా తిరుగుదాం. నీకు సెక్స్ కావాలంటే నన్ను అనుభవించు.. మరచిపో.. కానీ ప్రేమ, పెళ్లి అనే మాట ఎత్తకు అని దివ్యాంశ అనడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా అనిపించింది.

సరికొత్త గెటప్‌లో సిద్దార్థ్:ఇక సిద్దార్థ్, దివ్యాంశ కొత్త లుక్‌తో ఆకట్టుకొన్నాడు. సిద్దార్థ్ పిల్లిగెడ్డం పెటుటకొని.. లవర్ బాయ్‌గా, రౌడీలకు బుద్ది చెప్పే యువకుడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. మే 26న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాతో సిద్దార్థ్ మంచి హిట్ కొడతాడా లేదా వేచి చూడాల్సిందే.

టక్కర్ సినిమాలో....
నటీనటులు: సిద్దార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగిబాబు, మునిష్ కాంత్, ఆర్జే విగ్నేశ్వర్ తదితరులు
రచన, దర్శకత్వం: కార్తీక్ జీ క్రిష్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
సహ నిర్మాత: వివేక్ కుచిబొట్ల
మ్యూజిక్: నివాస్ కే ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వంచినాథన్ మురుగేషన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్షన్: ఉదయ కుమార్ కే
స్టంట్స్: దినేష్ కాశీ
రిలీజ్ డేట్: 2023-05-26


Click it and Unblock the Notifications











