నాలుగు నెలలు థియేటర్లు బంద్.. షూటింగ్‌లపై మంత్రి తలసాని సంచలన ప్రకటన

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉండగా.. కొన్ని రంగాలపై కోలుకోలేని దెబ్బ కొడుతోంది. కరోనా వైరస్ ముఖ్యంగా వినోదరంగంపై అశనిపాతంలా పడింది. గత రెండు నెలలు లాక్‌డౌన్ కారణంగా సినిమా హాల్లు, షూటింగ్స్ అన్ని మూత పడ్డాయి. నిర్మాతలకు కొన్ని కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అయితే లాక్‌డౌన్‌లో భాగంగా కొన్నిరంగాలు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందినవారిలో ఆశలు రేకెత్తాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, థియేటర్స్ ఓపెన్ అవుతాయని, షూటింగ్స్ మళ్లీ మొదలుపెట్టుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్స్ అందర్నీ షాక్‌కు గురి చేసింది. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం.

 మంత్రిని కలిసి బుల్లితెర యూనిట్..

మంత్రిని కలిసి బుల్లితెర యూనిట్..

ఆ మధ్య బుల్లితెరకు చెందిన పెద్దలు మంత్రిని కలిసి.. నిబంధనల మేరకు లోబడే సీరియల్స్ షూటింగ్ జరుపుకుంటామని విన్నవించుకుంది. అప్పుడు సానుకూలంగా స్పందించిన మంత్రి.. తాజాగా జరిపిన భేటీలో అది సాధ్యపడకపోవచ్చని పేర్కొన్నాడు.

థియేటర్స్ ఓపెనింగ్స్‌పైనా..

థియేటర్స్ ఓపెనింగ్స్‌పైనా..

గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. థియేటర్స్ ఓపెన్ కానున్నాయని, సీటుకు సీటుకు మధ్య గాప్ ఉంటుందని, షో అనంతరం శానిటైజ్ చేస్తారని ఇలా కొన్ని నిబంధనలతో ప్రారంభం కానున్నాయని వార్తలు వచ్చాయి. అయితే తాము మాత్రం ఇంకో రెండు మూడు నెలల వరకు థియేటర్స్ ఓపెన్ చేయకూడదని, షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు.

వారు సిద్దంగానే ఉన్నారు..

వారు సిద్దంగానే ఉన్నారు..

అయితే కొన్ని మల్టీ ప్లెక్స్‌లు మాత్రం అన్ని నిబంధనలు పాటించేందుకు సిద్దంగా ఉన్నా.. లోకల్‌గా ఉండే థియేటర్స్ అంత మొత్తాన్ని భరించలేవు. పైగా జనాలు కూడా సినిమా థియేటర్లకు వచ్చేందుక భయపడతారు.. ఇదంతా సాధారణ స్థితికి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Salman Khan Responded On Rumors That He Is Casting Actors For SKF
లుంబినీ, గోకుల్ చాట్ ఘటనలు..

లుంబినీ, గోకుల్ చాట్ ఘటనలు..

లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రజలంతా భయపడ్డారని, కానీ ఇప్పుడు ఆ ప్రదేశాలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలాగే ఇది కూడా సాధారణ పరిస్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X