తెలంగాణలో థియేటర్ల మూసివేత: క్లారిటీ ఇచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
గత ఏడాది కరోనా వైరస్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా వినోద రంగంపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్నే చూపించింది. దీంతో మన దేశంలోని సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్‌లు చాలా కాలం పాటు మూతపడ్డాయి. ఈ కారణంగానే చాలా సినిమాల విడుదల వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లను పున: ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత వంద శాతం సీటింగ్‌కు కూడా పర్మీషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం.. ప్రత్యేక గైడ్ లైన్స్‌తో గత డిసెంబర్ నుంచి యాభై శాతం సీటింగ్‌తో.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వంద శాతం ఆక్యూపెన్సీతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నడుస్తున్నాయి. సింగిల్ స్క్రీన్‌లతో పాటు మల్టీ ఫెక్స్‌లు కూడా కోవిడ్ నిబంధన అనుసరిస్తున్నారు. అయితే, ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో తెలంగాణలోని థియేటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. కొద్ది రోజులుగా పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులపై ఆధ్యాయనం చేసిన వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది.

కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది. దీంతో రాష్ట్రంలో నడుస్తోన్న థియేటర్లను మరోసారి మూసివేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు.. వీలైతే సినిమా హాళ్లను మూసి వేయాలని లేకుంటే యాభై శాతం ఆక్యూపెన్సీతో నడిపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా థియేటర్ల మూసివేత వార్తలను ఆయన ఖండించారు. అంతేకాదు, కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లు యాథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











