గొల్లపూడి మరణం : చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది.. తలసాని కామెంట్
సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గొల్లపూడి నేడు గుండె పోటుతో మరణించారు. దీంతో తెలుగు సినీ ప్రముఖులే గాక రాజకీయ నాయకులు సైతం ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చిత్ర పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని..
సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి మారుతీ రావు రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన 6 నంది అవార్డులు అందుకున్నారని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారని, ఈయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సినీ పరిశ్రమకు తీరని లోటు..
గొప్ప నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతి రావు చనిపోవడం.. చాలా బాధకారం, ఎందుకుంటే రచయితగా ఆయనకు నేను పెద్ అభిమానిని. కథా, మాటల , స్క్రీన్‌ప్లే రచయితగా ఇలా మూడు నంది అవార్డులు అందుకున్నారు..ఆయనకు పెక్యూలర్ టైమింగ్, స్టైలింగ్, మాడ్యులేషన్ ఉన్నాయి. తనదైన శైలిలో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాల్లో చేసి అందర్నీ మెప్పించారు. అలాంటి గొప్ప రచయత లేకపోవడం.. సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ కోన వెంకట్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు.
వరుణ్
ఆయనతో కలిసి నటించడం ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను. అద్భుతమైన వ్యక్తి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు ధన్యవాదాలు. గురువు గారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.
కాజల్
గొల్లపూడి మారుతి రావు గారి మరణ వార్త విన్ని షాక్ అయ్యాను. ఆయన పనితనంతో ఎంతో మందిని ప్రభావితం చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఆత్మకు శాంతి చేకూరాలి. అంటూ కాజల్ అగర్వాల్ పేర్కొంది.
నితిన్
ఇది తెలుగు సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











