14 వేల మంది సినీ కార్మికులకు సాయం.. ముందుకు వచ్చిన తలసాని
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. కొందరికి పూట గడవడం కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది మహానుభావులు, స్వచ్చంద సంస్థలు నిత్యావసర సరుకులను అందించడమో లేదా ఆహారాన్ని సరఫరా చేయడం చేయడమో లాంటివి చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మరో వైపు ఏ ఒక్కరూ కూడా ఆకలికి అలమటించకూడదని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
కరోనా వైరస్‌పై పోరాటంగా విధించిన లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ మొత్తం మూతపడింది. దీంతో దాదాపు పద్నాలుగు వేల మంది సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. అయితే సినీ శ్రామికులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలంతా ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించి.. కార్మికులను ఆదుకున్నారు. తాజాగా వీరి కోసం తెలంగాణ ప్రభుత్వం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకొచ్చారు.

సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సినీ కార్మికులకు అండగా నిలిచారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సాయం అందించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. సినీ, టీవీ కార్మికుల కష్టాలపై తలసాని ఇటీవల సినీపెద్దల సమావేశంలోనూ ఆరా తీశారు. ఈ మేరకు వారందరికీ నిత్యావసర సరుకులు అందించాలని, ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











