twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిలో స్టామినా తగ్గలేదు.. ఇంకా కుర్రాడిలానే.. మంత్రి ప్రశంసల వర్షం.

    By Rajababu
    |

    Recommended Video

    Chiranjeevi Still Looks Young : Talasani Srinivasa Yadav

    ఘనంగా సంతోషం వార్షికోత్సవ వేడుకలు.. మెగాస్టార్ చేతుల మీదుగా అవార్డులుప్రముఖ సినీ వార పత్రిక 'సంతోషం' 16వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో 'సంతోషం' అధినేత సురేష్ కొండేటి నిర్వహించిన ఈ వేడుకలకు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సౌత్‌లోని పలువురు నటీనటులకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులను అందజేశారు.

    చిరంజీవి ప్రోత్సాహంతోనే

    చిరంజీవి ప్రోత్సాహంతోనే

    మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సాదాసీదా జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి సినిమాలపై ఉన్న మక్కువతో సినీ రంగంలోకి వచ్చి ఇంత ఉన్నతమైన స్థానానికి ఎదిగిన సురేష్ కొండేటి ఎంతోమందికి ఆదర్శం. చిరంజీవిగారి ప్రోత్సాహంతో సురేష్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కేవలం ఒకే ఒక్కడు ఇంత బ్రహ్మాండంగా అవార్డుల కార్యక్రమం చేయడం.. అది కూడా 16 ఏళ్లుగా చేయడం సామాన్యమైన విషయం కాదు అన్ని అన్నారు.

    సింప్లిసిటీగా సురేష్ కొండేటి

    సింప్లిసిటీగా సురేష్ కొండేటి

    తెలుగు వారికే కాకుండా దక్షిణాది వారందరికీ అవార్డులు ఇవ్వడం ఆయనకే చెల్లింది. సురేష్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తి మన సురేష్. ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు అని మంత్రి తలసాని ప్రశంసించారు.

    150 సినిమాలు చేసినా

    150 సినిమాలు చేసినా

    చిరంజీవిగారిని చూస్తే.. మొన్న వచ్చి ఖైదీ నంబర్ 150కి, గతంలో చూసిన ఖైదీకి పెద్ద తేడా లేదనిపిస్తోందన్నారు. ‘‘ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగియి. అవి ఆయన 45వ పుట్టినరోజు వేడుకలేమో అనిపిస్తోంది. 150 సినిమాలు చేసినా ఇప్పటికీ ఆయనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా కుర్రాడిలాగే డ్యాన్సులు చేస్తున్నారు.

    చిరంజీవితో రేంజ్ మారింది

    చిరంజీవితో రేంజ్ మారింది

    ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తర్వాతి కాలంలో చిరంజీవిగారు ఒక్కరే స్టార్‌గా నిలిచారు. చిరంజీవిగారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. అన్నయ్య స్వయం కృషితో పైకి వచ్చారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా పైకి తీసుకొచ్చారు. ఇంకా ఎంతోమంది జీవితాన్నిచ్చారు. యువతరానికి చిరంజీవిగారు ఎంతో ఆదర్శం. ఆయనను చూసి యువ హీరోలు ఎంతో నేర్చుకోవాలి.'' అని చెప్పారు.

     గీత గోవిందంతో ఓ రేంజ్

    గీత గోవిందంతో ఓ రేంజ్

    ఈ తరంలో విజయ్ దేవరకొండ, సింగర్ రేవంత్.. చిరంజీవిలాగే కష్టపడి పైకి వచ్చారని, విజయ్ దేవరకొండ గీత గోవిందంతో గొప్ప రేంజ్ సంపాదించాడని మంత్రి ప్రశంసించారు. ఇండియన్ ఐడల్ పోటీల్లో రేవంత్‌కు ఓటేసిన వాళ్లలో తాను కూడా ఉన్నానని మంత్రి అన్నారు. కష్టపడే వాళ్లకు ఇండస్ట్రీలో తప్పకుండా పేరొస్తుందని, చిత్ర పరిశ్రమ మన తల్లిలాంటిందని, మనందరం దాన్ని కాపాడుకోవాలని తలసాని పిలుపునిచ్చారు.

    English summary
    Santhosham film Awards function held in hyderabad. Chiranjeevi, Talasani Srinivasa Yadav are the guests. In this function, Minister said that, Chiranjeevi looks still young.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X