మారుతి ‘కలలు కనే వయసు’లో కొత్తవారికి ఛాన్స్

By Bojja Kumar

హైదరాబాద్: 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' వంటి యూత్ ఫుల్ చిత్రాలతో అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి నిర్మాతగా మారి మరో యూత్ ఫుల్ చిత్రం తీసేందుకు సిద్ధమయ్యారు. 'కలలు కనే వయసు' టైటిల్ తో రూపొందబోయే ఈచిత్రానికి 'లక్కి' చిత్ర దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తుండగా, క్రియేటివ్ కమర్షియల్, మారుతి టాకీస్ సంస్థలు సంయుక్తంగా దీన్ని తెరకెక్కించబోతున్నారు.

తన సినిమాలను ఎక్కువగా కొత్తవారితోనే రూపొందించే మారుతి, ఈ చిత్రంలో కూడా న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు సెలక్షన్స్ ప్రారంభించారు. సెలక్షన్స్ పూర్తయిన తర్వాత మార్చి నెలో ఈచిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు.

విషయమై దర్శకుడు హరి మాట్లాడుతూ నిర్మాత కెఎస్. రామారావు, మారుతి కలిసి నిర్మిస్తున్న 'కలలు కనే వయసు' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో ఐదు జంటలు ముఖ్య పాత్రలు పోషిస్తారు. ఈ పాత్రలకు కొత్త వారిని తీసుకుంటున్నాం. మార్చి 9 వరకు మాకు వచ్చిన ప్రొఫైల్స్ చెక్ చేసి, మార్చి 10న వారికి ఫోటో షూట్ చేసి పాత్రలకు తగిన విధంగా సెలక్ట్ చేస్తామన్నారు.

'మా సినిమాలో నటించే ఆసక్తి, గుడ్ లుకింగ్ అండ్ టాలెంట్ ఉంటే వారు ఈ నెల 9 వరకు వారి ఫోటోలతో మా ఆఫీసును సంప్రదించ వచ్చును. మా సినిమాకు అవసరమయ్యే లక్షణాలు, టాలెంట్ ఉంటే తప్పకుండా మీరు ఈ సినిమాలో భాగస్వాములు అవుతారు, అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు' అని హరి సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X