నాగచైతన్య లేటెస్ట్ చిత్రం '100% లవ్' టాక్ ఏంటి
ఈ రోజు(శుక్రవారం) నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన 100% లవ్ చిత్రం విడుదల అయింది. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.రిలీజ్ కు ముందు సినిమా బాగోదంటూ నెగిటివ్ టాక్ బాగా వినిపించినా ఇప్పుడు ఈ చిత్రం యూత్ ఎంటర్టైనర్ గా అందరికీ నచ్చుతుందని చెప్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలు (నాగచైతన్య), మహాలక్ష్మి (తమన్నా) గా కనిపించారు. ప్రతీ విషయంలోనూ తానే గొప్ప అనిపించుకోవటం కోసం ప్రేమను పణంగా పెట్టే పాత్రలో నాగచైతన్య జీవించాడని అంటున్నారు. ఇక రెగ్యులర్ గా సుకుమార్ సినిమాల్లో కనిపించే ఊహించని ట్విస్టులు, ఐటం సాంగ్ లు ఉన్నా సినిమా మొత్తం ఓ చక్కని రొమాంటిక్ కామిడీగా సాగటం చాలా మందికి నచ్చుతోంది. బాగా సెన్సిటివ్ గా ఉండే ఈ సబ్జెక్టుని సుకుమార్ చాలా బాగా డీల్ చేసాడంటున్నారు. రెగ్యులర్ సుకుమార్ చిత్రాల కన్నా తక్కువ బడ్జెట్ లో తక్కువ రోజుల్లో వచ్చిన మంచి అవుట్ పుట్ ఇది. ఈ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన బన్నీ వాసు హిట్టుకొట్టినట్లే అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











