ఫుల్లుగా చూపించడానికి సిద్దమైన జెనీలియా
కెరీర్ తొలి నాళ్లలో అందాల ఆరబోతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా తన పెర్పార్మెన్స్ తోనే నెట్టుకొచ్చిన జెనీలియాకు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గి పోయాయి. దీంతో అందాల ప్రదర్శనలో జోరు పెంచేందుకు సిద్ధమైంది. తెలుగులో వెంకటేష్ నటించిన 'ఘర్షణ" హిందీ రీమేక్ లో అవకాశం దక్కించుకున్న జెనీలియా....దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిసైండ్ అయింది. ఈ సినిమాలో కాస్త రెచ్చిపోయి హాట్ హాట్ గా అందాలు ఆరబోయాలని, మగాళ్ల చూపులన్నీ తవైపు తిప్పకోవాలని, తన అందాల గురించి గుసగుసలాడుకునేలా చేయాలని, మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని నిర్ణయానికి వచ్చిందని బాలీవుడ్ టాక్.
ఘర్షణ తెలుగు వర్షన్ లో ఆసిన్ పోషించి 'మాయ" పాత్రను చేస్తున్న జెనీలియా నటన విషయంలో ఆసిన్ ను మంచి మంచి మార్కులు కొట్టేయడంతో పాటు, ఇటు అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్లలో రెచ్చి పోయేందుకు సిద్ధమని దర్శక నిర్మాతలకు హామీ కూడా ఇచ్చిందట. మరి జెనీలియా ప్రయత్నాలు ఎంత మేరకు పలిస్తాయో? చూడాలి..


Click it and Unblock the Notifications











