పుష్కరం గ్యాప్ పవన్ కెరీర్లో మార్పు తెచ్చేనా?

By Bojja Kumar

Pavan Kalyan
పుష్కరం(12 ఏళ్లు) తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో సినిమా రూపొందుతుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తుంది. చాలా కాలంగా సరైన హిట్ లేని పవన్ కళ్యాణ్‌‌కు పూరి జగన్నాధ్ పూర్వ వైభవం తేవడం ఖాయం అంటున్నారు.

గతంలో పూరి జగన్నాథ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో పవన్ గతంలో ఎన్నడూ లేని విధంగా తనదైన మ్యానరిజంతో యూత్ ను ఆకట్టుకున్నాడు. పవన్ అలా నటించేలా డైరెక్ట్ చేసింది పూరి జగన్నాధే. ఆ తర్వాత అదే టైపులో పవన్ తెరపై ఓ ఊపు ఊపాడు. యూత్ ఐకాన్ గా మారాడు.

జల్సా సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ లేదు. పులి దారుణంగా ప్లాపయితే. తీన్ మార్ ఓ మోస్తరు ఫలితాలను సాధించింది. ఇటీవల వచ్చిన పంజా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకులను మెప్పించాలనే కసి పవర్ స్టార్లో ఉన్నప్పటికీ...అందుకు తగిన దర్శకులు దొరకడం లేదు. హీరో హీరోయిజాన్ని తెరపై అభిమానులు కేరింతలు కొట్టే విధంగా ప్రజెంట్ చేయడంతో పాటు, స్ర్కిప్టు, స్క్రీన్ ప్లే, డైలాగుల విషయంలో సిద్ధ హస్తుడు పూరీ జగన్నాధ్ పవన్ తో ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

అన్ని అనుకున్నట్లు జరిగితే పుష్కరం గ్యాప్ ఇద్దరి కెరీర్లో మరిచిపోలేని కాలంగా కలకాలం గుర్తుండి పోతుందనే వాదన వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి స్పందన లేక పోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X