»   » వర్మతో సీక్వెల్ చేస్తున్నట్లు ప్రకటించిన మెగాస్టార్!

వర్మతో సీక్వెల్ చేస్తున్నట్లు ప్రకటించిన మెగాస్టార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో బాలీవుడ్లో గతంలో పలు హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. 2005 లో సర్కార్, 2008లో సర్కార్ రాజ్ చిత్రాలు వర్మ కెరీర్లో బాగా హైలెట్ అయిన చిత్రాల జాబితాలో ఉంటాయి. ఈ సినిమాలు అమితాబ్ బచ్చన్ ని డాన్ కేరక్టర్లో సూపర్ గా ఎస్టాబ్లిష్ చేశాయి. వీటికి స్వీకెల్ గా ఇప్పుడు సర్కార్ 3 కూడా రాబోతోంది.

ఈ సినిమా గురించి స్వయంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శుక్రవారం ప్రకటించారు. తన తాజా సినిమా 'టె3న్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ....'రాముతో సర్కార్-3 సినిమా గురించి చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఇద్దరం కలిసి స్టోరీ డిస్క్రీషన్ చేయబోతున్నాం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది' అని తెలిపారు.

Talks are on with Ram Gopal Varma for Sarkar 3: Amitabh Bachchan

సర్కార్-2 తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చాలా కాలంగా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ వార్తలను అమితాబ్ ఖండించారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. వర్మతో తనకు ఎప్పటి నుండో మంచి స్నేహం ఉందన్నారు.

సర్కార్-3 గురించి మరిన్ని విషయాలు చెబుతూ ముంబై క్రైం డ్రామాను కథాంశంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కుతుందని తెలిపారు అమితాబ్. ఈ సర్కార్ లో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ లు ఉండరని తెలుస్తోంది. మిగిలిన డీటైల్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Talks are on with Ram Gopal Varma for Sarkar 3: Amitabh Bachchan

వర్మ కూడా ఈ సినిమాపై చాలా అంచనాలతో ఉన్నాడు. చాలా కాలంగా బాలీవుడ్ కు దూరంగా ఉన్న ఉన్న వర్మ ఇటీవలే అక్కడ మళ్లీ ఆఫీస్ తెరిచారు. అక్కడ ఇటీవలే 'వీరప్పన్' మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

English summary
Amitabh Bachchan today confirmed that discussions were on between him and Ram Gopal Varma for Sarkar 3. Revealing the same at TE3N’s trailer launch, Big B said, “I am in talks with Ramu for Sarkar 3. We are going to sit for a story narration and very soon the project should start.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu