నాగార్జున-దశరథ్ కాంబినేషన్ డీటేల్స్

నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాగార్జున, దశరత్ కాంబినేషన్లో 10 ఏళ్ల క్రితం 'సంతోషం' లాంటి సూపర్ హిట్ మూవీ రూపొందింది. తాజాగా వీరిద్దరి కాబినేషన్లో రూపొందే సినిమా ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది.
ప్రస్తుతం నాగార్జున కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'షిరిడి సాయి' అనే భక్తి రస చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ డివోషనల్ చిత్రాలు రూపొందాయి. అందులో భక్తుడి గెటప్‍లో కనిపించిన నాగార్జున...తాజాగా 'షిరిడి సాయి' చిత్రంలో తొలిసారిగా దేవుడి పాత్రలో నటిస్తున్నారు.
షిరిడి సాయి చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథ సమకూర్చగా.... సాయికృపా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా వేద వ్యాస్, చంద్రబోస్ లిరిక్ రైటర్స్‌గా పని చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటల అందిస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం.


Click it and Unblock the Notifications











