అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా: సెక్సీ భామ
రామ్ చరణ్ కు 'మగధీర" సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ హీరో అయినా అంతటి విజయాన్ని చవిచూడాలని అనుకుంటాడు. అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ లాగా తనకో మంచి హిట్ చిత్రం కావాలనే గట్టిగా కోరుకుంటున్నాడట. దాంతో కొడుకు కోరిక తీర్చడం కోసం అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో 'బద్రీనాథ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ డాన్సుల్లో బన్నీతర్వాతే ఎవరైనా అంటోంది సెక్సీభామ తమన్నా. 'బద్రినాథ్" సినిమా కోసం అల్లు అర్జున్ తో రొమాన్స్ చేస్తోన్న తమన్నా, 'బద్రీనాథ్" తనకు వెరీ వెరీ స్పెషల్ ఫిలిం..అని చెప్పుకొచ్చింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో. మరి తెలుగు తెరపై అత్యంత భారీ చిత్రంగా వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'బద్రీనాథ్"తో నటిగా తానేంటో మరో మారు ప్రూవ్ చేసుకుంటానని చెబుతోంది తమన్నా. తెలుగు తెరపై 'బద్రీనాథ్" తనకు సరికొత్త విజయాన్ని అందిస్తుందనీ, బద్రినాథ్ తర్వాత మరింత ఎక్కువగా తెలుగు తెరపై ఫోకస్ పెడ్తానని తమన్నాఅంటోంది. మరి తమన్నా 'బద్రినాథ్" తో పాటు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమా లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











