»   » 'బాహుబలి' రెండో భాగంలో నా పాత్ర పరిధి తక్కువ

'బాహుబలి' రెండో భాగంలో నా పాత్ర పరిధి తక్కువ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో తమన్న హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్ ల్లోనూ కనిపించనుంది. అయితే రెండో పార్ట్ లో ఆమె తక్కువ సేపు కనిపిస్తుంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'బాహుబలి'లో తను పోషించిన పాత్ర గురించి తమన్నా చెబుతూ ''సినిమాలో నేనూ కత్తిపట్టి పోరాటాలు చేశా. ఆ విషయంలో రాజమౌళిగారు మార్గనిర్దేశం చేశారు. 'బాహుబలి' మొదటి భాగంలో పూర్తిస్థాయిలో కనిపిస్తా. రెండో భాగంలో నా పాత్ర పరిధి తక్కువగా ఉంటుంది.'' అంది తమన్నా.


Tamanna about Baahubali character

అలాగే... రాజమౌళి తీస్తున్న సినిమా ఎలా ఉంటుందో అందులో నటించేవాళ్లకు కూడా పూర్తిగా తెలియదు. ఆ దృశ్యాలు కేవలం రాజమౌళి వూహల్లోనే ఉంటాయి. అందుకే 'బాహుబలి' గురించి ఎవరైనా అడిగినప్పుడు... వూహకు కూడా అందని అంశాల్ని వూహించమని మాత్రం చెబుతుంటా'' అంది తమన్నా.


ఇక దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోందామె. తమిళం, హిందీ భాషల్లో నటిస్తున్నా... నన్ను తెలుగు హీరోయిన్ గానే గుర్తిస్తుంటారని చెబుతోంది. త్వరలోనే ఆమె 'బాహుబలి' చిత్రంతో సందడి చేయబోతోంది. మరోపక్క 'బెంగాల్‌ టైగర్‌'లో రవితేజ సరసన ఆడిపాడుతోంది.


తమన్నా మాట్లాడుతూ... ''తెలుగు హీరోయిన్ అనిపించుకోవడాన్ని గర్వపడతా. ఇక్కడ నేను చేసిన సినిమాలే నాకు ఆ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయినా... నటీనటులకు భాషాభేదాలు ఉండవు. తమిళం, హిందీ చిత్రాలతోనూ ప్రేక్షకులకు చేరువ కావడం ఎంతో సంతృప్తినిచ్చింది''అని చెబుతోంది.


అలాగే... ''సొంతంగా నిర్ణయాలు తీసుకొనేంత స్థాయికి ఎప్పుడో వచ్చాను. హీరోయిన్ గా ప్రయాణం మొదలైన తక్కువ సమయంలోనే ఆ పరిణతిని సాధించా. అలాగని ప్రతిదీ నాకు నచ్చినట్టు చేయను. అప్పుడప్పుడు సన్నిహితుల అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకొంటా. చివరికి మాత్రం మనసు ఏం చెబితే అదే చేస్తా'' అని చెబుతోంది తమన్నా.


ఇక సినిమాల ఎంపిక విషయంలో ఎవరిపైనైనా ఆధారపడుతుంటారా? అని అడిగితే ''కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సన్నిహితులతో చర్చిస్తుంటానంతే. ఎంపిక మాత్రం నాదే. అలా చేయడమే సబబు అని నమ్ముతా. మన మనసు చెప్పిందే చేసుంటాం కాబట్టి... వాటి ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరిస్తాము''అని సెలవిచ్చింది తమన్నా.

English summary
Tamanna said ...she has full length role in Baahubali first part.
Please Wait while comments are loading...