ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉంది కానీ...: తమన్నా
ప్రస్తుతం తమన్నా ..హిమ్మత్ వాలా చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఈచిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.
అదే సినిమాను పద్మాలయా సంస్థ హిందీలో 'హిమ్మత్ వాలా' పేరుతో 1983లో తెరకెక్కించింది. ఇందులో జితేంద్ర, శ్రీదేవి నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ లో శ్రీదేవి అందాల తారగా మార్కులు సంపాదించారు. ఇప్పుడు అదే చిత్రం రీమేక్‌లో తమన్నా నటిస్తోంది. 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే బాలీవుడ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తమన్నాకు అక్కడ కలిసి రాక సౌత్ బాట పట్టి సక్సెస్ అయింది. మరి హిమ్మత్ వాలా రీమేక్ ద్వారా తమన్నా బాలీవుడ్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
ఒక సినిమాకూడా విడుదల కాకుండానే తమన్నాకు ఆఫర్స్ వరసగా వచ్చి పడుతున్నాయి. ఆమె తాజా చిత్రం హిమ్మత్ వాలా.. ట్రైలర్స్ చూసిన బాలీవుడ్ జనం ఆమెచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాంతో తమన్నా హిందీలో మరో అవకాశాన్ని దక్కించుకొన్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోయే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. ఈ యేడాది చివర్లో షూటింగ్ మొదలవుతుంది. హిమ్మత్ వాలా చిత్రం మార్చి 29 న విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications












