'రచ్చ'లో తమన్నా పాత్ర ఏమిటంటే...
రామ్‌చరణ్, తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'రచ్చ'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. అక్కడ కలిసిన మీడియాతో తమన్నా చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ......దర్శకుడు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. జీవితంపై అవగాహన పాత్ర, బాగా ఉన్నత కుటుంబానికి చెందిన దానిగా నటిస్తున్నానని అన్నారు. అలాగే ఈ సినిమా చేస్తున్నంతసేపూ చాలా ఎంజారు చేస్తూ నటించాను. రామ్‌చరన్‌తో నటించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్‌గా ఉంది. అతను చేస్తున్న డాన్స్ చూసి నేను నేర్చుకున్నాను.రేపు పొల్లాచ్చిలో తీయబోయే సాంగ్ ఫోక్ సాంగ్ అని చెప్పింది.
రామ్‌చరణ్, తమన్నా జంటగా నటిస్తోన్న 'రచ్చ' చిత్రం షఉటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు, పలువురి డాన్సర్లపై ఓ పాటను చిత్రిస్తున్నారు. నేటితో పాటల పూర్తవుతుందనీ, రేపటినుంచి పొల్లాచ్చిలో మరో పాటను చిత్రించనున్నామని మీడియా సమావేశంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ తెలియజేశారు. సూపర్ గుడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌రుషి, పార్తీబన్, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ తదితరులు నటించారు. మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సమీర్‌రెడ్డి, కళ: ఆనంద్‌సాయి, నిర్మాతలు: ఎన్.వి. ప్రసాద్, పారస్‌జైన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.


Click it and Unblock the Notifications











