అపుడు తెలంగాణ, ఇప్పుడు పవన్ పార్టీ: భయంతో తమన్నా!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జన సేన' పార్టీ ఎన్నికల వేళ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సినిమా రంగానికి చెందిన వారు ఎక్కడ ప్రెస్ మీట్లోపాల్గొన్నా వారికి తప్పకుండా పవన్ కళ్యాణ్ పార్టీ గురించిన ప్రశ్న ఎదురవుతోంది. దీంతో ఎవరికి తోచిన తీరుగా వారు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ తమన్నాకు కూడా పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి తమన్నా స్పందిస్తూ....'నాకు అసలు రాజకీయాల గురించి అవగాహన లేనే లేదు. ఆయన పార్టీ గురించి మాట్లాడాలంటే నాకు ముందు రాజకీయాల గురించి తెలుసుండాలి. అందుకే నేను మాట్లాడను' అంటూ వ్యాఖ్యానించారు.

తమన్నా వ్యాఖ్యలు బట్టి.....పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ఏం మాట్లాడితే...ఏంజరుగుతుందో? అనే భయంతో ఆమె ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో కూడా తెలంగాణ అంశంలో ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె స్పందించడానికి నిరాకరించారు. తన కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతోనే తమన్నా ఇలాంటి వివాదాస్పద అంశాలపై స్పందించేందుకు భయపడుతోందని స్పష్టమవుతోంది.
జనసేన పార్టీ గురించిన విషయాల్లోకి వెళితే....పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని స్పెప్ తీసుకున్నారు. బిజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి తన మద్దతు ప్రకటించారు. దేశానికి కాబోయే ప్రధాని మోడీయేనని ఆయన అన్నారు. విధివిధానాలు లేకుండా రాష్ట్రాన్ని చీల్చారని, మోడీ లాంటి వ్యక్తి నిర్ణయం తీసుకునే స్థానంలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











