నాగ చైతన్యే అసలైన డార్లింగ్ : తమన్నా

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ తమన్నా మహా తెలివిగలది. బహుషా ఆమె ఈ రేంజికి చేరడానికి అందం, అభినయంతో పాటు....ఆ తెలివి తేటలు కూడా ఓ కారణమేమో. ఎవరితో పని చేస్తే వారిని పొగడ్తలతో ముంచెత్తడం తమన్నాకు మొదటి నుండి అలవాటే. వారిని తన మాటల గారడితో ఫిదా చేసి....అవకాశాలు దక్కించుకోవడంలో మహా గడుసరి.

తాజాగా నాగ చైతన్యతో కలిసి 'తడాఖా' చిత్రంలో నటించిన తమన్నా ఆ చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటూ నాగచైతన్యను ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇప్పటికే చైతూతో '100% లవ్' చిత్రంలో నటించిన తమన్నా, ఆ అనుభవాలతో పాటు 'తడాఖా' అనుభవాలను కూడా రంగరించి చైతూను ఓ రేంజికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

నాగ చైతన్య చాలా మంచి కోస్టార్ అని, ఎంతో మంచి వాడని, అసలైన డార్లింగ్ అంటే నాగ చైతన్యే అని మీడియాలో టముకు వేస్తోంది. ఇదంతా తన సినిమా హిట్ చేసుకోవడం భాగమే అనుకోండి. 'తడాఖా' సినిమాలో నటిస్తున్న హీరోలకంటే బిగ్ ఇమేజ్ ఉన్న తమన్నా అయితేనే బెటరని నిర్మాతలు కూడా డిసైడ్ అయ్యారు. ఆమెతోనే టీవీల్లో ప్రచార కార్యక్రమాలు గట్రా చేయిస్తున్నారు.

ఇక 'తడాఖా' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెల 10న సినిమా విడుదలవుతోంది. నాగ చైతన్, తమన్నా, సునీల్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డాలి దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. తమిళంలో మాధవన్, ఆర్య నటించిన హిట్ మూవీ వెట్టై చిత్రానికి ఇది రీమేక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X