పవన్‌ కల్యాణ్‌ని డామినేట్ చేయలేదంటూ...

By Srikanya

హైదరాబాద్ : ''పవన్‌కల్యాణ్‌ని డామినేట్ చేయాలని చూడటమా ... అది కుదరే పనికాదు. ఆయన ఈ సినిమాలో నటించలేదు.. జీవించారు. నాది ఇందులో టామ్‌బోయ్ తరహా పాత్ర. అందుకే అలా బిహేవ్ చేశాను. ఏదైనా కల్యాణ్‌సార్, జగన్‌సార్ కాంబినేషన్లో నటించడం గర్వంగా ఫీలవుతున్నా'' అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమాలో గంగగా కనిపించిన ఆమె చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియా వారిని కలిసినప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె పై విధంగా స్పందించారు.

'తొలిసారిగా మగాడిలా దూసుకుపోయే తత్వం వున్న డేరింగ్ గర్ల్ పాత్రను చేశాను. ఈ చిత్రంలో టామ్‌బాయ్ తరహాలో కనిపించడానికి చాలా కసరత్తు చేశాను. పవన్‌కల్యాణ్‌తో కలసి నటించడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. స్టార్‌హీరో అనే కాకుండా వ్యక్తిత్వపరంగా కూడా ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు' అని ఆమె తెలిపింది.
సినిమాలో బీరు తాగారు. నిజంగా అలవాటుందా? అనంటే... ''ఓ సినిమాలో మర్డర్ చేస్తా. చంపడం అలవాటుండే చేశానా?''అని ఎదురు ప్రశించారు తమన్నా.

అలాగే ''సినిమా ప్రభావం సమాజంపై ఎంత వరకూ ఉంటుందనే విషయం స్పష్టంగా చెప్పలేం. అది ప్రేక్షకుల అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. సినిమా నుంచి ఏం తీసుకెళ్తారో వాళ్లిష్టం. అయితే సినిమాలో హీరో,హీరోయిన్స్ ఏం చేసినా.. అది వినోదం పంచిపెట్టడానికే'' అంది తమన్నా. ఇక పవన్ ని ఆఫ్ స్క్రీన్ నేను పెద్దగా చూసింది లేదు. ఎందుకంటే సెట్లో షాట్ అయిపోగానే ఆయన కేరవాన్‌లోనే ఎక్కువగా ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని మాత్రం చెప్పగలను. ఆయనకు ఇన్ని లక్షల మంది అభిమాన గణం ఉండటానికి కారణం ఆయన నటనే కాదు. ప్రవర్తన కూడా'' అంది.

''ఓ సినిమాలో పద్ధతిగా కనిపిస్తున్నాను. మరో సినిమాలో అల్లరి చేస్తున్నాను. ఈ సినిమాలో రౌడీరాణిలా దర్శనమిచ్చాను. విభిన్నమైన పాత్రలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి'' అని చెప్పింది. బాలీవుడ్‌ సంగతులు చెబుతూ ''అక్కడ మన సినిమాల గురించే ఎక్కువ మాట్లాడుకొంటారు. 'పోకిరి', 'విక్రమార్కుడు' సినిమాల్ని రీమేక్‌ చేసి విజయాలు సాధించారు. అవి అక్కడ వంద కోట్ల సినిమాలు. వాళ్ల దృష్టి మనపైనే ఉంటుంది. 'హిమ్మత్‌వాలా' కూడా తెలుగు కథే కదా. దక్షిణాదిని విడిచి వెళ్లను.. వెళ్లలేను. అంతగా ఈ పరిశ్రమతో మమేకం అయిపోయా'' అని చెప్పింది.

ఇంకా ఆమె చెబుతూ ''పూరి జగన్నాథ్ కమిట్‌మెంట్ ఉన్న దర్శకుడు. ఆర్టిస్టుల నుంచి నటనను రాబట్టుకోవడంలో దిట్ట. ఒకట్రెండు టేకుల్లోనే షాట్‌ని ఓకే అయ్యేలా చేస్తారాయన అన్నారు''. ఆర్డినరీ అమ్మాయి, ఎక్స్‌ట్రార్డినరీ అమ్మాయికి తేడాను పవన్ వివరించే సీన్ తనకు బాగా నచ్చిందని, అలాగే గేబ్రియేల్‌తో పోట్లాడే సీన్ కూడా ఇష్టమని తమన్నా చెప్పారు. ఈ సినిమాకు వచ్చిన కాంట్రవర్సీల విషయంలో స్పందించలేనని, నటన నేర్చుకోవడంలోనే తీరిక లేకుండా ఉన్న నాకు పాలిటిక్స్‌తో పనిలేదని ఆమె అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X