తమన్నా నటన అదుర్స్: జూ ఎన్టీఆర్
ఊసరవెల్లి సినిమా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత హీరోయిన్ కోసం రెండు నెలల పాటు వెతికాం, చివరకు తమ సినిమాకు ఆమె పర్ ఫెక్టుగా సెట్ అవుతుందని నిర్ణయానికి వచ్చాక ఎంపిక చేశాం..అంటూ తమన్నాను గురించి తెగ పొగిడేశాడు జూనియర్ ఎన్టీఆర్. తమన్నా తొలుత తొలుగులో నటించి తర్వాత తమిళ్ లో మంచి మీరోయిన్ గా ఎదిగి, మళ్లీ తెలుగులో పెద్ద హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సినిమాలో ఆమె నటన అద్భుతం. 25 రోజుల క్రితమే మేము సినిమా చూశాం. కోన్ని సన్ని వేశాల్లో తమన్నా నటన నా కళ్ల వెంట నీళ్లు తెప్పించింది. అంత అద్భుతంగా ఆమె నటించింది. నా అభిప్రాయం ప్రకారం 'ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ సినిమాలో తమన్నా అంత అద్భుతంగా నటించ లేదు" అంటూ తమన్నాను ఆకాశానికెత్తేశాడూ జూనియర్.
ఈ నెల 6న ఊసరవెల్లి సినిమా విడుదల సందర్భంగా మంగళవారం ఫిల్మ్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూనియర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో దర్శకుడు సుంరేందర్ రెడ్డి, నిర్మాత చత్రపతి ప్రసాద్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మంచి హిట్టయింది. ఈ నేపథ్యంలో సినిమాపైనా అంచనాలు పెరిగి పోయాయి.


Click it and Unblock the Notifications











