ఆగడు: మహేష్ బాబు సరసన తమన్నా!
హైదరాబాద్ : 'బాద్ షా' చిత్రంతో హిట్ కొట్టిన శ్రీను వైట్ల తర్వాత మహేష్ బాబుతో 'ఆగడు' సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పూర్తయిన తర్వాత 'ఆగడు' సినిమా సెట్ప్ పైకి రానుంది.
కాగా...ఆగడు సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరు? అనే విషయమై ఫిల్మ్ నగర్లో చర్చ మొదలైంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.
ఇప్పటికే ఓసారి మహేష్ బాబుతో సుకుమార్ సినిమాలో చేసే అవకాశం రాగా...డేట్స్ ప్రాబ్లం వల్ల చేజార్చుకున్న తమన్నా ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరుగకుండా డేట్స్ విషయలో జాగ్రత్త పడుతోంది. దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











