తమన్నా తెలివైంది...వెంటనే మొదలెట్టేసింది
హైదరాబాద్ : తమన్నా తో పనిచేసిన వారు ఆమె ఇంటిలిజెన్స్ ని మెచ్చుకోకుండా ఉండరు. మొన్నటిదాకా హిందీ సినిమా కబుర్లు వినిపించింది తమన్నా. అక్కడ నటించిన 'హమ్‌షకల్స్' కోసం ప్రచారం చేస్తూ బిజీ బిజీగా గడిపింది. ఆ సినిమా ఇటీవల విడుదల కావడంతో... వెంటనే 'బాహుబలి' కోసం రంగంలోకి దిగింది. ఈ సినిమాని ప్రమోట్ చేయటం మొదలెట్టింది. తొలి రోజున పాత్రకు అనువైన దుస్తులు ధరించి సరిచూసుకొంది. సోమవారం చిత్ర బృందంతో కలసి రిహార్సల్స్‌లో పాల్గొంది.

ఈ రోజు (మంగళవారం) నుంచి ఆమెపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. 'బాహుబలి' గురించి తమన్నా ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తోంది. ఇలాంటి పాత్రను తొలిసారి పోషిస్తున్నానని, అందుకే ఎంతో ఆత్రుతగా ఉందని చెప్పుకొచ్చింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరో. తమన్నాని ఓ హీరోయిన్ గా ఎంపిక చేసుకొన్నారు. సినిమాలో బాహుబలి, శివుడు అనే రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపిస్తారు. శివుడు పాత్ర సరసన తమన్నా నటిస్తోంది.
ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో ద్వారా 'బాహుబలి' కబుర్లు వినిపించింది. ''ఇదివరకు 'బాహుబలి'లాంటి సినిమాను నేనెప్పుడూ చేయలేదు. ఇలాంటి పాత్ర నాకు కొత్తే. అందుకే పాత్రకు తగిన దుస్తులు వేసుకొన్నప్పుడు, ఆ కేశాలంకరణతో ముస్తాబైనప్పుడు తెలియని అనుభూతి కలిగింది. సినిమాలో వైవిధ్యంగా కనిపిస్తాను'' అని చెప్పుకొచ్చింది తమన్నా.


Click it and Unblock the Notifications











