రెబల్‌లో... డాన్స్ టీచర్‌గా తమన్నా
హైదరాబాద్: మిల్కీ బ్యూటీ తమన్నా 'రెబల్' చిత్రంలో తను పోషించిన పాత్రపై చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రెబల్' చిత్రంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేస్తున్న తమన్నా, దీక్ష సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్నా ఇందులో డాన్స్ టీచర్ పాత్రలో కనిపించనుంది.
తన పాత్ర గురించి తమన్నా వివరిస్తూ... నేను ఈచిత్రంలో హిప్ హాప్ డాన్స్ టీచర్ పాత్ర పోషించాను. దర్శకుడు రాఘవ లారెన్స్ నన్ను ఈచిత్రంలో ప్రత్యేకంగా ప్రజెంట్ చేసాడు. నా క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాతో పాటు ప్రభాస్, దీక్షా సేథ్ పాత్రలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. నేను ఈచిత్ర విడుదలపై చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను' అని వెల్లడించింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, దీక్షా సేథ్, నేను చాలా స్నేహంగా ఉండే వాళ్లం, సినిమా యూట్ మొత్తం ఎంతో జాలీగా పని చేసాం అని తమన్నా గుర్తు చేసుకుంది.
'రెబల్' చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











