twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య సినిమాలో పాత్ర గురించి తమన్నా

    By Srikanya
    |

    నాగచైతన్యతో తను చేస్తున్న ' 100 % లవ్"చిత్రంలో తన పాత్ర పేరు 'మహాలక్ష్మీ" అని, ఎంతో వైవిధ్యంగా, సున్నితంగా వుండే ఆ పాత్రను దర్శకుడు మలిచిన విధానం ఎంతో బాగుంటుందని కూడా చెప్తున్నారు తమన్నా. అలాగే .కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందిందని తన కెరీర్ లో నిలిచిపోయే చిత్రం అవుతుందని ఆమె మురిసిపోతూ చెప్తోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ప్రెష్ గా ఫీలవుతారు అని చెప్తున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని అంటోంది.

    ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. నాగచైతన్య కూడా ఈ చిత్రం గురించి చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన దర్సకుడు సుకుమార్ డెడికేటెడ్ డైరక్టర్ అని.. ఆ విషయం స్క్రిప్టు నేరేట్ చేస్తున్నప్పుడే అనుభవంలోకి వచ్చింది అంటున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఏడిద రాజా.

    English summary
    Naga Chaitanya next movie with Tamanna under Sukumar direction titled was confirmed as 100% love. Bunny Vasu producing the movie under Geeta arts banner.Devi Sri Prasad composing music for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X